![హత్రాస్‌లో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం](https://static.v6velugu.com/uploads/2020/10/hathras-3.jpg)
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఈ ఘటన జరిగి నెల కాకముందే అదే హత్రాస్‌లో మరో అత్యాచారం జరగడం కలకలం రేపుతోంది. హత్రాస్‌లోని సస్నిలో నాలుగేళ్ల చిన్నారి మీద సమీప బంధువుల్లో ఒకరు అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేశామని సర్కిల్ ఆఫీసర్ రుచీ గుప్తా తెలిపారు.