చందానగర్ లో వైద్యం వికటించి బాలుడు చనిపోయాడని ఆందోళన

చందానగర్ లో వైద్యం వికటించి బాలుడు చనిపోయాడని ఆందోళన
  • చందానగర్ విష్ణు పారామిత దవాఖానాలో ఎదుట 

చందానగర్, వెలుగు:  వైద్యం వికటించడంతో ఓ బాలుడు మృతి చెందాడు.  పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన రాజు, సిఫోరా తమ ముగ్గురు పిల్లలతో కలిసి రామచంద్రపురంలో నివాసముంటూ కంప్రెషర్ పనులు చేసుకుంటున్నారు. రాజు కుమారుడు జాన్సన్ (4) రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం జాన్సన్ కు వాంతులు కావడంతో చందానగర్ లోని విష్ణు పారామితకు హాస్పిటల్‌‌‌‌కి తీసుకువచ్చారు.  

డ్యూటీ డాక్టర్ జాన్సన్‌‌‌‌కు ఇంజక్షన్ చేయాలని, మెడికల్ షాప్‌‌‌‌లో ఇంజక్షన్ తీసుకురావాలంటూ జాన్సన్ తండ్రి రాజుకు తెలిపారు.  రాజు ఇంజక్షన్ తీసుకుని వచ్చేలోపు అక్కడే ఉన్న నర్సు బాబుకు మరో ఇంజక్షన్ చేసింది. ఇంజెక్షన్ చేసిన కొద్దిసేపటికే జాన్సన్ మృతి చెందాడు.  డాక్టర్ చెప్పిన ఇంజక్షన్ కాకుండా వేరే ఇంజక్షన్ చేయడంతోనే తమ బాబు మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు.  సమాచారం అందుకున్న చందానగర్ ఇన్‌‌‌‌స్పెక్టర్  పాలవెల్లి సిబ్బందితో కలిసి హాస్పిటల్ కు వచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు