నాలుగేండ్ల బాలుడికి ఎంత కష్టం

  •     నాలుగేండ్ల బాలుడికి ఎంత కష్టం
  •     అరుదైన ఎక్ట్ర్సో ఫీ బ్లాడర్ వ్యాధితో తిప్పలు
  •     శరీరం లోపల ఉండాల్సిన యూరిన్​ బ్లాడర్​బాడీ బయట
  •     మూత్రంపై నియంత్రణ లేక నిరంతరం విసర్జన
  •     ఆపరేషన్​కోసం రూ.8 లక్షల ఖర్చు
  •     ఆపన్నుల సాయం కోసం నిరీక్షణ

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్​ సిటీలోని ఆర్యా నగర్​కు చెందిన కమ్మరి సంతోష్, స్వాతిరాణి దంపతుల నాలుగేండ్ల కొడుకు గౌతంరాజ్​అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ చిన్నారికి ఆపరేషన్​ చేయించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గౌతంరాజ్​ ఎక్ర్ట్సోఫీ బ్లాడర్​అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా బాడీ లోపల ఉండాల్సిన యూరిన్​బ్లాడర్ ​శరీరం బయట ఉండడంతో మూత్ర విసర్జనపై కంట్రోల్​ఉండడం లేదు. మూత్రం బొట్టుబొట్టుగా నిరంతరం బ్లాడర్​నుంచి లీక్​ అవుతోంది. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు శుభ్రంచేస్తూ బట్టతో చుడుతున్నారు. బయట పిల్లలెవరితోనూ గౌతంరాజ్​ ఆడుకోలేపోతున్నాడు.

యాక్సిడెంట్​తో మారిన సీన్​

సంతోష్, స్వాతి దంపతులకు మొదట కూతురు శాన్వీ పుట్టింది. ఆ పాప ఇప్పుడు ఐదో క్లాస్​ చదువుతోంది. ఉన్న దాంట్లో సర్దుకుపోతున్న తరుణంలో గౌతంరాజ్​అరుదైన వ్యాధితో పుట్టడంతో ఆ కుటుంబంలో కష్టాలు మొదలయ్యాయి. హైదరాబాద్​ నిలోఫర్​సహా ప్రైవేట్​ ఆస్పత్రుల్లో కొడుకును చూపించారు. కిలోన్నర బరువుతో పుట్టినందున ఆపరేషన్​ చేయలేమని డాక్టర్లు చెప్పారు. కావాల్సిన బరువు పెరిగాక ఆపరేషన్​ చేయించడానికి రెడీ అయి రూ.8 లక్షలు సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో కరోనా లాక్​డౌన్​తో చేయించలేదు. సరిగ్గా అప్పుడే సంతోష్ కు యాక్సిడెంట్​అయింది. 

ప్రమాదంతో కాలు, చేయి పనిచేయలేదు. పనిచేసి కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేక కొడుకు ఆపరేషన్​ కోసం సిద్ధం చేసిన రూ.8 లక్షలు ఖర్చుపెట్టారు. సంతోష్​ ఇటీవలే కోలుకున్నాడు. కొడుకును బాగు చేయించాలనే ఆరాటంతో గత బీఆర్ఎస్​ గవర్నమెంట్​లో మంత్రులుగా ఉన్న కేటీఆర్, హరీశ్​రావు, ఎమ్మెల్సీ కవితను కలిసి సహాయం కోసం అర్థించాడు. వారు సరే.. అన్నారే తప్ప ఏమీ చేయలేదని సంతోష్​ ఆవేదనతో చెప్పాడు. 

స్విగ్గీలో డెలివరీ బాయ్​గా చేస్తూ ఉపాధి పొందుతున్నానని, తన భార్య స్వాతిరాణి షాప్​లో పనిచేస్తోందని తెలిపాడు. హైదరాబాద్​రెయిన్​బో హాస్పిటల్​ యాజమాన్యం రెండు రకాల ఆపరేషన్​తో తమ కొడుకును బాగు చేయొచ్చని చెప్పిందన్నారు. దాతలు ఆదుకోవాలని ఆయన కోరుతున్నాడు. తన గూగుల్, ఫోన్​పే నంబర్లు 90007 33746, 7780 434617కు దాతలు సాయం పంపవచ్చని తెలిపారు.