
మృత్యువు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా ప్రాణాలు పోవచ్చు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. పల్లి గింజ గొంతులో ఇరుక్కొని నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకరారం.. అబ్దుల్లాపూర్ మండలం లష్కర్ గూడ గ్రామంలో శ్యాంసుందర్ మాధవిల కూతురు తన్విక(4) . ఏప్రిల్ 28న ఉదయం పల్లీలు తింటుండగా ఒక పల్లి గింజ గొంతులో ఇరుక్కోవడంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారి తన్వికను నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గొంతులో పల్లి గింజ ఇరుక్కుని తన్విక మృతి చెందటంతో నాయకపల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.