
శ్రీకృష్ణుని జన్మదినాన్ని దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో ఉత్సాహంతో జన్మాష్టమిగా జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణ భగవానుడికి 12 రాశుల్లో నాలుగు రాశులంటే చాలా ఇష్టమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ నాలుగు రాశుల వారికి శ్రీకృష్ణడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాడని చెబుతున్నారు. ఇప్పుడు ఆ నాలుగు రాశుల వివరాలు తెలుసుకుందాం. . . .
వృషభరాశి
వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీకృష్ణుడు వృషభ రాశిలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి శ్రీకృష్ణుని హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటారని పండితులు అంటున్నారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ ఏడాది (2023) కృష్టాష్టమికి గొప్ప విజయాలు సాధిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
కర్కాటకరాశి
శ్రీకృష్ణునికి వృషభ రాశి తరువాత కర్కాటక రాశి అంటే చాలా ఇష్టమట. జ్యోతిష్య పండితులు చెప్పిన దాని ప్రకారంగా నమ్మకాల కర్కాటకరాశిలో జన్మించిన వ్యక్తులు అదృష్టవంతులవుతారట. శ్రీకృష్ణుడికి కర్కాటక రాశి అంటే చాలా ఇష్టమని.. వీరికి అదృష్టం వరించే వరాన్ని ఇచ్చాడని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. శ్రీకృష్ణుడు కర్కాటక రాశి వారికి కష్టాలను తొలగించి మానసిక ప్రశాంతతను చేకూర్చుతాడని పండితులు అంటున్నారు.
సింహరాశి
అర్జునుడికి సింహరాశి గడియలున్నప్పుడు.. శ్రీకృష్ణుడు ఉపదేశం చేశాడట. ఇది లక్ష్యం పట్ల అంకితభావం కలిగి ఉండి.. ఎంతో నిబద్దతతో ఉండి.. శాంతి వచనాలతో పాటు కార్య సిద్ది వాక్యాలను చెప్పాడట. అందువలన సింహరాశి వారికి సంతోషం... విజయం కలగాలని ఆశీర్వదించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కృష్ణాష్టమి (2023) న సింహరాశి వారు చేపట్టిన పనుల్లో విజయంతో పాటు గుర్తింపు కూడా లభిస్తుందని పండితులు అంటున్నారు.
తులారాశి
పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుడు కూడా తులారాశి పట్ల ప్రేమగా ఉంటాడు. ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాడట. శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల సంఘంలో గుర్తింపుతో పాటు సంపద కూడా పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కృష్ణ భగవానుడితో గాఢమైన సంబంధాన్ని ఏర్పరచుకునే తులారాశి వారి జీవితాలు ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా సాగుతాయంటున్నారు పండితులు.