- కోటి రూపాయల ఆస్తి నష్టం
- సంగారెడ్డి జిల్లా ఇప్పేపల్లిలో ఘటన
జహీరాబాద్, వెలుగు : చెరుకు తోటలకు నిప్పు అంటుకొని 40 ఎకరాల్లో కోతకొచ్చిన పంట కాలిబూడిదైన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. మొగడంపల్లి మండలం ఇప్పేపల్లిలో మంగళవారం ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని 40 ఎకరాల్లో చెరుకు పంటలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. 15 మంది రైతుల తోటలు కాగా.. రూ. కోటి వరకు నష్టం వాటిల్లింది.
చెరుకు తోటల్లో మంటలు చెలరేగిన విషయాన్ని రైతులు తెలుసుకుని జహీరాబాద్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వెళ్లి మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే మంటలు ఉధృతంగా చెలరేగి తోటలు పూర్తిగా కాలి బూడిదైనట్టు బాధిత రైతులు బేగరి పెంటప్ప, సుభాష్, జైపాల్, ఎండీ. జబ్బార్, షఫీ, జమీర్, అమీర్, అశోక్ రెడ్డి ఆవేదనతో చెప్పారు.