
ఉప్పల్ వేదికగా పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ లో దంచికొడుతున్నాడు. 40 బంతుల్లోనే సెంచరీ చేసి జట్టును విజయం దిశగా తీసుకెళ్తున్నాడు. 246 పరుగుల అసాధారణ లక్ష్యంలో అసమానంగా పోరాడుతున్నాడు. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన అభిషేక్.. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి పంజాబ్ ను వణికిస్తున్నాడు. రెండో ఓవర్ లో నాలుగు ఫోర్లు బాదడంతో పాటు.. ఐదో ఓవర్ లో 16 పరుగులు వచ్చాయి.
10 ఓవర్లో మార్కో జాన్సెన్ బౌలింగ్ లో రెండు సిక్సులు, రెండు ఫోర్లు సఫారీ బౌలర్ కు చుక్కలు చూపించాడు. అభిషేక్ శర్మతో పాటు మరో ఎండ్ లో హెడ్ కూడా బ్యాట్ ఝులిపించడంతో తొలి 13 ఓవర్లలో సన్ రైజర్స్ వికెట్ నష్టానికి 175 పరుగుల చేసింది. క్రీజ్ లో అభిషేక్ (100), క్లాసన్ (2) ఉన్నారు. 66 పరుగులు చేసి హెడ్ ఔటయ్యాడు. సన్ రైజర్స్ గెలవాలంటే మరో 7 ఓవర్లలో 71 పరుగులు చేయాలి. 40 బంతుల్లో సెంచరీకి చేసుకున్న అభిషేక్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది.