ఆ లింక్ ఓపెన్ చేస్తే ఖాతాలోని సొమ్ము ఖతమే

సైబ‌ర్ మోస‌గాళ్ల గురించి పోలీసులు, బ్యాంకులు ఎంత హెచ్చరించినా.. జనం మాత్రం వారి వ‌ల‌లో ప‌డి మోసపోతూనే ఉన్నారు. తాజాగా ముంబైలో ఓ మహిళ సైబర్ నేరగాళ్ల బారిన పడి లక్షలు పోగొట్టుకుంది. 

ఏం జరిగిందంటే..?

 శ్వేత అనే మహిళకు పాన్ కార్డు అప్ డేట్ చేయాలని హెచ్చరిస్తూ  బ్యాంకు నుంచి సందేశం వచ్చింది. అందులోని లింక్ ఓపెన్ చేసి వెంటనే ఆ పని పూర్తిచేయాలనే మేసేజ్ సూచించింది. మెసేజ్ లోని లింక్ ను ఓపెన్ చేయగానే అకౌంట్ నెంబర్, పాన్ కార్డు నెంబర్, నెట్ బ్యాంకింగ్ ఐడీ, పాస్ వర్డ్ అడిగింది. దీని ప్రకారం ఫాలో అయిన మహిళకు బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. బ్యాంకు నుంచి టెలీకాలర్ ను మాట్లాడుతున్నానంటూ పరిచయం చేసుకుని, మొబైల్ కు వచ్చిన రెండు ఓటీపీలను చెప్పాలని కోరడంతో..గుడ్డిగా నమ్మిన శ్వేత ఓటీపీలను షేర్ చేసుకుంది. ఆ తర్వాత కాల్ కట్ అయింది.  ఆ తర్వాత శ్వేత మొబైల్ కు డబ్బు కట్ అయినట్లు మేసేజ్ రావడంతో లబో దిబోమంది. సైబర్ నేరగాళ్లు శ్వేత అకౌట్ నుంచి రూ. 57,636లను కొట్టేయడం గమనార్హం.  

 కేవైసీ, పాన్ కార్డు వివ‌రాలు అప్‌డేట్ చేసుకోవాల‌ని కొంతమంది బ్యాంకు సక్టమర్ల మొబైల్ ఫోన్లకు ఫేక్ మెసేజ్‌లు వ‌చ్చాయి. ఆ మెసేజ్‌లు క్లిక్ చేసిన వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.లక్షల్లో డ‌బ్బు మాయమైంది. ప్రతి బ్యాంకు ఖాతాదారు, ఖాతా ఓపెన్ చేసిన‌ప్పుడు వారి కేవైసీ ప‌త్రాలు స‌మ‌ర్పించ‌డం త‌ప్పనిస‌రి. ఈ నిబంధ‌న‌ను అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు 40 మందిని నుంచి రూ.ల‌క్షల్లో న‌గ‌దు కొల్లగొట్టారు.