ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్లో 40 కుటుంబాలు చేరిక

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్లో 40 కుటుంబాలు చేరిక

ఖమ్మం, వెలుగు : ఖమ్మంలో ఆదివారం 28 వ డివిజన్ కార్పొరేటర్​ గజ్జల లక్ష్మీ వెంకన్న, అంకాల వీరభద్రం, పోతుల నరసింహారావు ఆధ్వర్యంలో 40 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జావేద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్న అభివృద్ధికి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టే పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరుతున్నా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు.