వరంగల్ కలెక్టరేట్ ఎదుట 40 మంది రైతుల ధర్నా

తమ భూములను కౌలుకు తీసుకొని రెవెన్యూ అధికారుల అండదండలతో పట్టాలు చేయించుకున్నారంటూ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్ నగర్ రైతులు ఆరోపించారు.  వరంగల్ కలెక్టరేట్ ఎదుట 40 మంది రైతులు ధర్నాకు దిగారు. అధికార పార్టీ నేతలు స్థానిక మంత్రి అండదండలతో తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దౌలత్ నగర్ కు చెందిన 40 మందికి SC కార్పొరేషన్ కింద ఒక్కొక్కరికి ఎకరా భూమి అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చిందని రైతులు తెలిపారు.

ఆ  భూమిని మంత్రి అనుచరుడు చింతపట్ల శ్రీనువాసరావు కౌలుకు తీసుకున్నారని... రెవెన్యూ అధికారుల అండదండలతో పట్టా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తమ భూమిని వారికి ఎలా పట్టాలు చేస్తారని ప్రశ్నిస్తే రెవెన్యూ అధికారులు తామేం చేయలేమంటున్నారని వాపోయారు. ఇదే విషయంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి వస్తే  పట్టించుకోవటం లేదన్నారు.