నల్లగొండలో జిల్లాలో మార్చి 16న ఉరుములు మెరుపులతో కూడిని భారీ వాన కురిసింది. దీంతో జిల్లాలో అక్కడక్కడ పిడుగు కూడా పడ్డాయి. ఈ క్రమంలో నాగార్జున సాగర్ పరిధిలోని చింతల తండాలో పిడుగుపాటుకు మేకలతో పాటు ఓ యువరైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో దాదాపు 40 మేకల, రామావత్ సైదానాయక్ అనే యువకుడు మృత్యువాతపడ్డారు.
నాగార్జునసాగర్ మండలం చింతల తండాకు చెందిన సైదానాయక్ అనే యువకుడు మేకలను కాసుకుంటూ జీవనం సాగించేవాడు. రోజులాగే ఇవాళ కూడా మేకలను మేత కోసం అడవికి తోలుకెళ్లాడు. ఉదయం నుండి మేకలను మేపుకుంటు ఓ చెట్టు కింద వాటిని నిలిపాడు. అంతలోనే ఒక్క సారిగా భారీ వర్షం అందుకుంది. వర్షం తగ్గిన తర్వాత వెళ్దామనుకొని ఆ కాపరి కాసేపు మేకలను చెట్టు కిందనే నిలిపాడు. ఇంతలో వర్షంతో పాటు ఉరుములు మెరుపులు కూడా రావడం మొదలైయ్యాయి.. వర్షం హోరెత్తిస్తుండగా.. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పిడుగు పడింది. దీంతో చెట్టు కింద ఉన్న ఆ యువకుడు, దాదాపు 40 మేకలు అక్కడికక్కడే చణిపోయాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషదఛాయలు నెలకొన్నాయి.