ఎస్‌‌‌‌వీకేఎం యూనివర్సిటీలో ఫుడ్‌‌‌‌ పాయిజన్‌‌‌‌

ఎస్‌‌‌‌వీకేఎం యూనివర్సిటీలో ఫుడ్‌‌‌‌ పాయిజన్‌‌‌‌
  • 40 మంది స్టూడెంట్లకు అస్వస్థత

జడ్చర్ల, వెలుగు : ఫుడ్‌‌‌‌ పాయిజన్‌‌‌‌ కావడంతో ఓ ప్రైవేట్‌‌‌‌ యూనివర్సిటీలో చదువుతున్న 40 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి శివారులోని ఎస్‌‌‌‌వీకేఎం యూనివర్సిటీలో గురువారం వెలుగు చూసింది. యూనివర్సిటీలో బీటెక్‌‌‌‌, లా చదువుతున్న 40 మంది స్టూడెంట్లు బుధవారం సాయంత్రం నుంచి వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. విషయం బయటకు పొక్కకుండా యూనివర్సిటీ ఆఫీసర్లు ప్రయత్నాలు చేశారు.

అయితే స్టూడెంట్ల అస్వస్థత విషయం లీక్ కావడంతో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌‌‌‌రెడ్డి యూనివర్సిటీ వద్దకు వచ్చి స్టూడెంట్ల పరిస్థితిని గమనించారు. వారికి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇప్పించకపోవడం పట్ల ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే స్టూడెంట్లను ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌కు తరలించారు. అయితే స్టూడెంట్లు బయటి ఫుడ్‌‌‌‌ తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని వర్సిటీ డీఆర్‌‌‌‌ మహేశ్‌‌‌‌కుమార్‌‌‌‌ తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.