40 టన్నుల చేపలు మృతి

పెద్దపల్లి జిల్లాలో  ఓ చెరువులో రూ. 40 లక్షల విలువైన చేపలు మృతి చెందాయి. రామగిరి మండలం సుందిళ్ళ గ్రామంలోని బక్క చెరువులో  రూ. 40 లక్షల విలువైన చేపలు మృత్యువాత పడ్డాయి.  చెరువులోకి సింగరేణి సంస్థ ఓసీపీ 5 ఓబీ కెమికల్ వాటర్ చేరడంతోనే చేపలు మృతి చెందినట్లు మత్య్సకారులు ఆరోపిస్తున్నారు.  40 టన్నుల చేపలు చనిపోయాయని..సింగరేణి సంస్థ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.