HCL కంపెనీలోనే.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గుండెపోటుతో మృతి

HCL కంపెనీలోనే.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గుండెపోటుతో మృతి

సాఫ్ట్ వేర్ జాబ్..  6 అంకెల జీతం.. వారానికి ఐదురోజుల పని.. సిటీలో రిచ్ లైఫ్.. వెంటపడి మరీ లోన్లు ఇచ్చే బ్యాంకులు.. సొసైటీలో మంచి గౌరవం ఉంటుంది... ఇదంతా నాణేనికి ఒకవైపే, కరోనా తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది... రెసిషన్ కారణంగా బడా కంపెనీలు కూడా లేఆఫ్స్ చేపడుతున్నాయి.. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగి చాలామందిలో ఆరోగ్య సమస్యలు ఎక్కవవుతున్నాయి. ఇటీవల పూణేకి చెందిన ఈవై ఉద్యోగిని ఆత్మహత్య మరువకముందే.. హెచ్ సీఎల్ కి చెందిన మరో ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. 

మహారాష్ట్రలోని నాగపూర్లో ఉన్న హెచ్ సీఎల్ కంపెనీలో ఓ 40ఏళ్ళ ఉద్యోగి గుండెపోటుతో వాష్ రూమ్ లోనే కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... హెచ్ సీఎల్ లో సీనియర్ అనలిస్ట్ గా పనిచేస్తున్న నితిన్ గుండెపోటుతో ఆఫీసులోని వాష్ రూంలోనే కుప్పకూలాడు. శుక్రవారం ( సెప్టెంబర్ 27, 2024 )  చోటు చేసుకుంది ఈ ఘటన. కుప్పకూలిన నితిన్ ను చుసిన కొలీగ్స్.. హుటాహుటిన ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అయితే... నితిన్ అప్పటికే మరణించారని నిర్దారించారు డాక్టర్స్.

ALSO READ | స్పీడ్ తగ్గించాలని అన్నందుకే.. కానిస్టేబుల్‌ను కారుతో గుద్ది చంపిన్రు

నితిన్ గుండెపోటుతో మృతి చెందినట్లు ఎయిమ్స్ డాక్టర్లు నిర్దారించి పోస్టుమార్టంకు తరలించారు డాక్టర్లు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నితిన్ మరణం దురదృష్టకరం అని పేర్కొంది హెచ్ సీఎల్ యాజమాన్యం. నితిన్ మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. నితిన్ కు భార్య, 6ఏళ్ళ కూతురు ఉన్నట్లు తెలుస్తోంది.

కరోనా కారణంగా ఐటీ ఉద్యోగులందరికీ వర్క ఫ్రమ్ హోమ్ ఇచ్చిన కంపెనీలు 10గంటలు, 12గంటలు ఇలా అడ్డు అదుపులేకుండా పని చేయించుకోవటం ప్రారంభించాయి. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రెసిషన్ భయం కారణంగా బడా కంపెనీలు సైతం లేఆఫ్స్ చేపడుతున్నాయి. ఒక పక్క పని ఒత్తిడి.. మరో పక్క ఉద్యోగం ఉంటుందా.. ఊడుతుందా అన్న భయంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ ఒత్తిడి వల్లనే ఇటీవల ఐటీ ఉద్యోగుల్లో గుండెపోటు వంటి ప్రాణాంతక సమస్యలు పెరుగుతున్నాయని చెప్పచ్చు.