
రాజన్న సిరిసిల్ల జిల్లా కేం ద్రానికి మహర్దశ పట్టనుంది. సిరిసిల్ల పట్టణ శివారులో మానేరు నది ఒడ్డున వందెకరాల ప్రభుత్వ స్థలంలో 400 కాటేజ్ లు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. మధ్యమానేరు బ్యాక్ వాటర్ లో బోటింగ్ సదుపాయం, ఆ పక్కనే బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం, మానేరు కరకట్ట పక్కనుంచి బతుకమ్మ తెప్ప వరకు వందఫీట్ల వెడల్పుతో ఫోర్ లే న్ రోడ్డు, హైమాస్ట్‌లైట్లు , మధ్యమధ్యలో చెక్ డ్యాంలు, అందులో మినీ బోటింగ్ లు,పార్క్‌లు ఏర్పాటు చేసేందుకు రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ వెం కట్రామ్ రెడ్ డి భారీ బడ్జెట్ తో ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ మేరకు తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్ రావ్ శనివారం సిరిసిల్లను సందర్శించి మానేరు తీరాన్ని పరిశీలించా రు. ప్రభుత్వ స్థలాలు చూసి అతిథి గృహాల నిర్మా ణాలకు అనువుగా ఉందనిపేర్కొన్ నారు. వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రతిభక్తుడు ఈ పర్యటక కేం ద్రాన్ని సందర్శించే విధంగా,అవసరమైతే ఇక్కడే అతిథి గృహాల్లో బస చేసేలా 400గెస్ట్ హౌస్ లు నిర్మించాలని భావిస్తున్నారు. మానేరుతీరం అభివృద్ధిపై చర్చించారు. టూరిజం ఎండీమనోహర్ రావ్ తో చేసిన అధ్యయనాన్ని ప్రభుత్వానికి పంపించనున్నట్లు కలెక్టర్ తెలిపారు