గత కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ కు వరద ఉదృతి కొనసాగుతున్న క్రమంలో 41గేట్లను ఎత్తారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 3 లక్షల 5 వేల 692క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 3 లక్షల 27 వేల 762 క్యూసెక్కులుగా ఉన్నట్లు తెలిపారు అధికారులు.
Also Read:-ట్యాంక్‌బండ్‌పై కుప్పకూలిన గణేష్ విగ్రహం.. ఫుల్ ట్రాఫిక్ జామ్
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091,అడుగులు 80.5టిఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1089.50అడుగులు 75.018టీఎంసీలుగా ఉన్నట్లు తెలిపారు అధికారులు. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతున్న క్రమంలో 32గేట్లను ఎత్తారు అధికారులు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 కాగా.. ప్రస్తుత నీటిమట్టం 13.9579 టిఎంసిలుగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇన్ ఫ్లో 4లక్షల 42వేల 628 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 4లక్షల 67వేల 434 క్యూసెక్కులుగా ఉన్నట్లు తెలుస్తోంది.