రష్యా దాడులనుంచి.. ఉక్రెయిన్ను కాపాడండి..జెలెన్ స్కీ ట్వీట్ వైరల్

రష్యా దాడులనుంచి.. ఉక్రెయిన్ను కాపాడండి..జెలెన్ స్కీ ట్వీట్ వైరల్
  • ఉక్రెయినపై రష్యా దాడి.. 41 మంది మృతి

కైవ్:ఉక్రెయిన్ పై మరోసారి విరుచుపడింది రష్యా.. మంగళవారం (సెప్టెంబర్ 3) ఉక్రెయిన్‌లోని పోల్టావాలోని సైనిక శిబిరంపై  బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ ఘటనలో 41మంది మృతిచెందారు. 180 మంది కి పైగా గాయపడ్డారు. రష్యాకు చెందిన రెండు బాలిస్టిక్ క్షిపణుల దాడి చేయడంతో ఓ ఆస్పత్రి, స్కూల్ పై పూర్తిగా ధ్వంసమయ్యాయి ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది.  

ఆసుపత్రులు, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని రష్యా... రెండు బాలిస్టిక్ క్షిపణులతో దాడుల చేసింది. ఉక్రెయిర్ అధ్యక్షుడు జెలెన్ స్కీ X ద్వారా ధృవీకరించారు. వాటిలో టెలికమ్యూనికేషన్ ఇనిస్టిట్యూట్ భవనం పాక్షికంగా ధ్వంసమైందన్నారు. 

ఈ దాడుల్లో శిథిలాల కింద చాలా మంది చిక్కుకొని  ఉన్నట్లు జెలెన్ స్కీ ట్వీట్ చేశారు. ఈ దాడిలో 41 మంది చనిపోగా , 180 మందికి గాపై గాయపడ్డారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని.. ఇప్పటికి చాలా మందిని రక్షించుకున్నట్లు  జెలెన్ స్కీ చెప్పారు. 

ఇది ఉగ్రదాడి.. ఈ టెర్రర్ ను ఈ దాడులను ఆపేలా చర్యలు తీసుకోవాలని  ప్రపంచ దేశాలకు జెలెన్ స్కీ విజ్ణప్తి చేశారు. ఆలస్యం కాకుండా రష్యన్ టెర్రర్ నుంచి మమ్మల్ని రక్షించాలి అంటూ జెలెన్ స్కీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.