వేములవాడలో డ్రంకెన్​ డ్రైవ్‌‌‌‌లో 41 మందికి జైలు శిక్ష

వేములవాడలో  డ్రంకెన్​ డ్రైవ్‌‌‌‌లో 41 మందికి జైలు శిక్ష

వేములవాడ, వెలుగు: డ్రంకెన్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌లో పట్టుబడిన 91మందికి వేములవాడ జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జ్యోతిర్మయి జైలు శిక్ష, జరిమానా విధించినట్లు వేములవాడ టౌన్​ సీఐ వీరప్రసాద్ తెలిపారు. 

14  రోజులుగా జరిపిన వాహనాల తనిఖీల్లో మందు తాగి పట్టుబడిన వారిని శనివారం కోర్టులో ప్రవేశపెట్టామని, వీరిలో ఇద్దరికి 7 రోజులు జైలు శిక్ష, ఏడుగురికి 3 రోజులు జైలు శిక్ష, ఐదుగురికి 5 రోజులు జైలు శిక్ష, 27 మందికి 2 రోజుల జైలు శిక్ష, 50 మందికి జరిమానా విధించారని సీఐ తెలిపారు.