సైదాబాద్​లో 4.10 సెం.మీ. వాన

సైదాబాద్​లో 4.10 సెం.మీ. వాన

హైదరాబాద్/సికింద్రాబాద్, వెలుగు: గ్రేటర్​పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. అత్యధికంగా సైదాబాద్ లో 4.10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఢబీర్​పురాలో 3.98, చార్మినార్​లో 3.35, కంచన్ బాగ్ లో 3 సెంటీమీటర్ల వాన పడింది. మిగిలినచోట్ల మోస్తరు వాన కురిసింది.

ఈదురు గాలులకు చాలాచోట్ల చెట్లు విరిగి పడ్డాయి. బేగంపేటలో చెట్లు విరిగి పడ్డాయని తెలుసుకున్న జోనల్ కమిషనర్ రవికిరణ్ స్పాట్​కు వెళ్లి డీఆర్ఎఫ్ సిబ్బందితో క్లియర్​చేయించారు. సికింద్రాబాద్​లోని పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరో రెండ్రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.