ఆంధ్రప్రదేశ్‌లో 40వేల ఏళ్ల క్రితంనాటి ఆస్ట్రిచ్ పక్షి గూడు

వడోదరలోని MS విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఓ పక్షి గూడును కనుకొన్నారు. జర్మనీ, ఆస్ట్రేలియా, యూస్ దేశాలకు చెందిన సైంటిస్టులతో కలిసి ప్రకాశం జిల్లాలో పరిశోధనలు చేశారు. వారికి కనిపించిన గూడు 41వేల ఏళ్ల క్రితం నాటి నిప్పు కోడి పక్షి గూడు అని కనుగొన్నారు.

40 కిలోల కంటే ఎక్కువ బరువున్న జంతువులు ఎందుకు అంతరించిపోయాయని చేస్తున్న పరిశోధనలో భాగంగా ఈ పక్షి గూడుని వారు కనుగొన్నారు. ప్రకాశం జిల్లాలోని గూడులో 9 నుంచి 11 గుడ్ల వరకు ఉండేవని వారి అనుకుంటున్నారు. వీటి గుడ్లు ఒక్కటి 10అడుగుల వెడల్పు ఉంటుందట. గతంలో కూడా దక్షణ భారతదేశంలో 3వేల 500 నిప్పు కోడి గుడ్ల పెంకులు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.