దేశంలో 400 దాటిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో 400 దాటిన ఒమిక్రాన్ కేసులు

ఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా కొత్త వేరియెంట్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 415కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 108 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 79, గుజరాత్ లో 43, తెలంగాణలో 38, కేరళలో 37, తమిళనాడు 34, కేరళ 31, రాజస్థాన్ 22, హర్యానా, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లలో 4, జమ్మూ కాశ్మీర్, బెంగాల్ లో 3, యూపీలో 2, చండీఘడ్, లద్దాఖ్, ఉత్తరాఖండ్ లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. మొత్తం 415 మంది బాధితుల్లో 115 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు.
మరోవైపు శుక్రవారం దేశంలో కొత్తగా 7,189 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. 7,286 మంది కోలుకోగా.. 387 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 77,032 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసుల సంఖ్య పెరగుతుండంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆంక్షలు కఠినం చేశాయి.

మరిన్ని వార్తల కోసం..

యూఎస్, యూరప్ లలో డెల్మిక్రాన్ భయం

అమలుకు నోచుకోని హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్