
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,250 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. అలాగే ఒక్క రోజులో కొవిడ్-19తో 33 మంది చనిపోయారని చెప్పింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,79,872కు చేరగా.. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 44,773గా ఉందని తెలిపింది. ఇప్పటివరకు కరోనాతో 12,599 మంది చనిపోయారని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.