యూపీఎస్సీకి రూ.425.71కోట్లు

యూపీఎస్సీకి రూ.425.71కోట్లు

న్యూఢిల్లీ: కేంద్రం బడ్జెట్​లో యూపీఎస్సీకి రూ.425.71 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.216.72 కోట్లు సివిల్స్​పరీక్షల నిర్వహణ, రిక్రూట్​మెంట్​కు కాగా, మిగిలిన రూ.208.99 కోట్లు చైర్మన్‌, సభ్యుల జీతాలు, అలవెన్స్‌లు, పరిపాలనాపరమైన ఖర్చులకు అని నిర్మల తెలిపారు. అలాగే యాంటీ కరప్షన్ అంబుడ్స్ మన్ లోక్​పాల్​కు రూ.33.32 కోట్లు కేటాయించారు.

సెంట్రల్​విజిలెన్స్​కమిషన్(సీవీసీ)కి రూ.51.31కోట్లు అలాట్​చేశారు. 2023–24లో సీవీసీకి మొదట రూ.44.46కోట్లు కేటాయించగా, తర్వాత ఆ మొత్తాన్ని రివైజ్​చేసి రూ.47.73 కోట్లకు పెంచారు. ఈసారి అదనంగా రూ.3.58 కోట్లు కేటాయించారు.