ఏపీలో 12 గంటల్లో 43 కొత్త కేసులు నమోదు
మొత్తంగా పాజిటివ్ కేసులు 87కు చేరిక
కరోనా వైరస్ ఆంధ్రపదేశ్ లో విజృభిస్తుంది. కేవలం 12 గంటల సమయంలో 43 కొత్త కేసులు నమోదయ్యాయి. మార్చి 31 రాత్రి 9 గంటల నుంచి ఏప్రిల్ 1 ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 43 కొత్త కేసులు నమోదు అయినట్లు ఏపీ నోడల్ ఆఫీసర్ తెలిపారు. కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా జనవరిలో చివరి వారంలో మొదలయితే.. ఏపీలో మాత్రం వారం కింది నుంచే పాజిటివ్ కేసులు నమోదు కావడం మొదలయింది. అయితే లేట్ గా వచ్చనా లేటేస్ట్ అన్నట్లు అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య వారంలోనే 87కు చేరింది. అదే తెలంగాణలో పాజిటివ్ కేసులు నమోదు కావడం మొదలయి 20 రోజులు కావొస్తుంది. ఇక్కడ మాత్రం 97కు చేరింది. కాగా.. ఏపీ, తెలంగాణల మధ్య కేవలం 10 కేసులు మాత్రమే వత్యాసం ఉంది. ఏపీలో నమోదయిన కేసులలో ఎక్కువగా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వల్లేనని స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణలో కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వారివల్లే కేసుల సంఖ్య పెరుగుతుంది. మొత్తంగా తెలంగాణ నుంచి 1000 మందికి పైగా ఈ ప్రార్థనలకు వెళ్లి వచ్చనట్లు సమాచారం. దేశం మొత్తం కదిపేస్తున్న ఈ కరోనా వైరస్ ఎక్కువగా ఢిల్లీ నుంచి వచ్చిన వారివల్లే వ్యాప్తి చెందుతుందని అధికారులు అంటున్నారు.
For More News..