- స్థల పరిశీలన చేసిన ఆర్మూర్, బోధన్ ఎమ్మెల్యేలు, కలెక్టర్
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మున్సిపల్‌పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంజూరు చేసిన రూ.43 కోట్లతో చేపట్టే ట్యాంకుల నిర్మాణానికి స్థలపరిశీలన మంగళవారం జరిగింది. ఆర్మూర్, బోధన్ ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి టౌన్‌లోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ , ఆఫీసర్స్ తో కలిసి పర్యటించారు. నాలుగైదు చోట్ల పెద్ద ట్యాంకుల నిర్మాణాలతో ఆ పరిసరాల్లోని వార్డులతో పాటు ఆర్మూర్, మామిడిపల్లి, పెర్కిట్ లో తాగునీటి సమస్య రాకుండా ఉండేలా స్థల పరిశీలన చేశారు.
అనంతరం జలాల్పూర్వద్ద ఇంటెక్వెల్ను పరిశీలించారు. అసైన్ మెంట్భూములను ఆక్రమిస్తే ఆర్మూర్‌లో బరాబర్ బుల్డోజర్స్‌ను తెప్పిస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం సరికాదన్నారు. లే అవుట్చేసిన స్థలాల్లోని పదిశాతం భూములను ఆక్రమించి నిర్మాణాలు చేయవద్దని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. అధికారులు వీటికి అనుమతి ఇవ్వవద్దని అన్నారు ఆర్మూర్ మున్సిపల్ కు మంజూరైన రూ.43 కోట్ల నిధులతో చేపట్టే పనుల ద్వారా 20 ఏండ్ల వరకు తాగునీటి సమస్య ఉండదని అన్నారు.