హైదరాబాద్​ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...

హైదరాబాద్​ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...

హైదరాబాద్​ లో  బుధవారం ( మే 2) రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ( 43 డిగ్రీలు) నమోదయ్యాయి. కరోనా తరువాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. అయితే కరోనాకు ముందు 2019, 2018, 2015లో పలు మార్లు ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే కరోనా తరువాత గరిష్ఠంగా 42డిగ్రీలు నమోదుకాగా ఈ వేసవిలో మాత్రం పగలు ఉష్ణోగ్రత 43డిగ్రీలకు చేరుకుంది.  దీనికి తోడు రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 30డిగ్రీలకు చేరుకోవడం, గాలిలో తేమ 20శాతం కంటే కిందకు పడిపోవడంతో పగలు ఎండ, వడగాల్పులు, రాత్రి ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

మే 2బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43.0డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.9డిగ్రీల సెల్సియస్  గాలిలో తేమ 16శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో గ్రేటర్ లో  వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నట్లు తెలుస్తున్నది. అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని వాతావరణ, ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యం గా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రతలు వహించాలని, తరచూ ద్రవ పదార్థాలు తీసుకోవాలని, ఎక్కువగా నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.