ఆఫ్ఘనిస్తాన్‌లో 24 గంటల వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 2024 జనవరి 12 శుక్రవారం ఉదయం 4.51 గంటలకు భూకంపం వచ్చింది. 17 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది.
24 గంటల వ్యవధిలో అఫ్గాన్‌లో భూకంపం రావడం ఇది రెండోసారి. గురువారం మధ్యాహ్నం 2.50 గంటల ప్రాంతాల్లో 6.1 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో న్యూఢిల్లీ, జమ్ముకశ్మీర్, పూంచ్, పాకిస్థాన్‌లోని లాహోర్‌తోపాటు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రకంపణలు వచ్చాయి.
ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి ప్రకంపనలు సంభవించింది. ఈ భూకంపాల వలన ఎలాంటి ప్రాణనష్టం, అస్తి నష్టం జరగలేదు.