ప్రాంగణ నియామకాల్లో 43 మంది ఎస్ బీఐటీ స్టూడెంట్స్ ఎంపిక

ఖమ్మం టౌన్, వెలుగు :  సిటీలోని ఎస్ బీఐటీ ఇంజినీరింగ్ కాలేజ్ కు చెందిన 43 మంది స్టూడెంట్స్ టెక్ మహేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూ లో సర్వీ డెస్క్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికయ్యారని కాలేజ్ చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. సెలెక్ట్​ అయిన వారికి ఇయర్ కు రూ.3 లక్షల వేతనం లభిస్తుందన్నారు. తమ కాలేజ్ విద్యార్థులు ప్లేస్మెంట్లు సాధించేందుకు ఇన్ఫోసిస్, ఐటీసీ అకాడమీ లాంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికీ విద్యతో పాటు పలు రంగాలలో  శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, డాక్టర్ జి. ధాత్రి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. రాజ్ కుమార్ మాట్లాడారు. ప్రాంగణ నియామకానికి మొత్తం 150 మంది విద్యార్థులు హాజరు కాగా 67 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారని తెలిపారు. సెలెక్ట్ అయిన వారిలో 43 మంది విద్యార్థులు ఉద్యోగాలకు తుది అర్హత సాధించారని చెప్పారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటికే 92 మంది ఎస్ బీఐటీ స్టూడెంట్స్​ వివిధ కంపెనీల్లో ప్లేస్మెంట్స్ సాధించారని వివరించారు.

ఎంపికైన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో టెక్ మహేంద్ర ఆర్ఎం జీ. డైలిస్ మార్వింగ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ షేక్ ఖాసిం, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే. అమిత్ బింధాజ్, అకాడమిక్ డైరెక్టర్లు గంధం శ్రీనివాసరావు, డాక్టర్ ఏవీవీ శివ ప్రసాద్, జీ.ప్రవీణ్ కుమార్, డాక్టర్, జే . రవీంద్రబాబు, డాక్టర్ ఎస్. శ్రీనివాసరావు, టీపీవో ఎన్. సవిత, కోఆర్డినేటర్ జీ. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.