తెలుగు రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థ అస్తవ్యస్తం: 432 రైళ్లు రద్దు.. 139 దారి మళ్లింపు

తెలుగు రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. నాలుగు రోజులుగా పడుతున్న కుండపోత వర్షాలకు కొన్ని చోట్ల రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. కొన్ని చోట్ల రైలు పట్టాలపై నీళ్లు నిలిచాయి.. మరికొన్ని చోట్ల రైలు పట్టాలపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రైలు రాకపోకలు దాదాపు బంద్ అయ్యాయి. రెయిన్ ఎఫెక్ట్‎తో దక్షిణ మధ్య రైల్వే శాఖ ఇప్పటి వరకు ఏకంగా 432 రైలు సర్వీసులను రద్దు చేసింది. మరో 139 రైలు సర్వీసులను దారి మళ్లించి..  మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. భారీ వర్షాలు, వరదలు వల్ల కొన్ని ప్రాంతాలు రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా రైళ్లను క్యాన్సిల్ చేసిటనట్లు తెలిపింది దక్షిణ మధ్య రైల్వే.

ప్రమాదానికి గురైన రైల్వే ట్రాక్ మరమత్తు పనులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపింది. మహబూబ్‎బాద్ కేసముద్రం ట్రాక్‎లకు సంబంధించి పనులు సాగుతున్నాయని.. రేపు (మంగళవారం) సాయంత్రం వరకు ఈ రూట్‎లో ఒక ట్రాక్ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని.. మరో రెండ్రోజుల్లో ఇంకో ట్రాక్ పనులు పూర్తయ్యే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‎తో పాటు ఉన్నతాధికారులు పనులను అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు.

ALSO READ : తెలంగాణకు తప్పిన గండం : మరో 5 రోజులు మోస్తరు వర్షాలు మాత్రమే

రద్దయిన ముఖ్యమైన రైళ్ల వివరాలు:

లింగంపల్లి - నర్సాపూర్, నాందేడ్ - విశాఖపట్టణం, కాచిగూడ-మిర్యాలగూడ, చెన్నయ్ సెంట్రల్ - చాప్రా, చెన్నయ్ - న్యూఢిల్లీ, సికింద్రాబాద్ - విజయవాడ, సికింద్రాబాద్ - గుంటూరు, లింగంపల్లి - కాకినాడ, మచిలీపట్నం - బీదర్, 
బీదర్ - మచిలీపట్నం. 

దారి మళ్లించిన ముఖ్యమైన రైళ్లు:

బొరక్ పూర్ - కోచివలి, అదిలాబాద్ - తిరుపతి, బనారస్ - కన్యాకుమారి, న్యూఢిల్లీ - తిరువనంతపురం, న్యూ ఢిల్లీ - చెన్నయ్, 
ఇండోర్ - కొచ్చివలి, బల్లర్షా - కాజీపేట - సికింద్రాబాద్ - గుంతకల్ - రేణిగుంట చేరుకుని రెగ్యులర్ రూట్ లో వెళతాయి..