హైదరాబాద్‌‌ తరలిన పోలీసు అభ్యర్థులు

యాదాద్రి, వెలుగు: ఉద్యోగ నియామకాల పత్రాలు అందుకోవడానికి యాదాద్రి జిల్లా నుంచి 438 మంది అభ్యర్థులు హైదరాబాద్​కు తరలివెళ్లారు. పోలీస్​ డిపార్ట్​మెంట్​లోని వివిధ విభాగాల్లో ఎంపికైన వారికి సీఎం రేవంత్​రెడ్డి నియామక పత్రాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. వీరందరినీ హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియం వద్దకు తరలించడానికి జిల్లా ఆఫీసర్లు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు.

వచ్చిన అభ్యర్థుల వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం వారందరు వెళ్తున్నబస్సులను డీసీపీ రాజేశ్​ చంద్ర, అడిషన్​ కలెక్టర్​ జీ వీరారెడ్డి జెండా ఊపి పంపించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, అధికారులు, పోలీస్ అధికారులు ఉన్నారు.