కర్ణాటక బంద్‌తో బెంగళూరు ఎయిర్ పోర్ట్లో గందరగోళం.. 44 విమానాలు రద్దు..

కర్ణాటక బంద్ సందర్భంగా బెంగళూరు విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. కర్ణాటక బంద్ కు కన్నడ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో బెంగళూరు విమానాశ్రయంలోకి కొంతమంది నిరసనకారులు ప్రవేశించారు. ప్రయాణానికి టికెట్లు తీసుకున్న ఐదుగురు నిరసనకారులు జెండాలతో విమానాశ్రయంలోకి ప్రవేశించారు. నిరసనకారులను అడ్డుకొని  అదుపులోకి తీసుకున్నారు  పోలీసులు. 

కర్ణాటక బంద్  సందర్భంగా శుక్రవారం దాదాపు 44 విమానాలు రద్దు చేశారు బెంగళూరు ఎయిర్ పోర్ట్ అధికారులు. బంద్ కారణంగా ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ALSO READ : సొంతింటి కల నెరవేర్చుకున్న యంగ్ హీరో.. వైరల్ అవుతున్న వీడియో

గత కొన్ని రోజులుగా కావేరీ జలాల వివాదంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమిళనాడుకు కావేరీ నదీ జలాలను  విడుదల చేయొద్దంటూ కన్నడ ఒక్కుట పేరుతో కన్నడిగులు ఆందోళన చేస్తున్నారు.