ఏపీలో 44 కొత్త కేసులు..473కి చేరిన కరోనా వైరస్ బాధితులు

ఏపీలో 44 కొత్త కేసులు..473కి చేరిన కరోనా వైరస్ బాధితులు

అమరావతి, వెలుగు: ఏపీలో మంగళవారం ఒక్కరోజే 44 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 473కు చేరింది. విజయవాడ, నెల్లూరులో ఇద్దరు మృతిచెందారు. వీరిద్దరికీ లోకల్ కాంటాక్ట్  ద్వారానే వైరస్ సోకినట్లు  తేలింది. విశాఖలో ఇద్దరు కోలు కొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు 14 మందిని డిశ్చా ర్జి చేయగా, 9 మంది మరణించారు. లాక్ డౌన్ ను పొడిగించిన నేపథ్యంలో రెడ్ జోన్లు, హాట్ స్పాట్లపై ప్రత్యేక దృష్టిసారిం చాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లాలో పని చేస్తున్న ఓ మహిళా ఎమ్మార్వోకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇదే జిల్లాలో డాక్టర్ కు కూడా కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.