
ఆశ్రమ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్
44 మందికి అస్వస్థత
కొత్తగూడెం జిల్లా పడమట నర్సాపురం ఆశ్రమ స్కూల్‌లో ఘటన
ఉడికీ ఉడకని అన్నం, కిచిడీ తిని 44 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. కొత్తగూడెం జిల్లా పడమట నర్సాపురం ఆశ్రమ స్కూల్‌లో మంగళవారం జరిగిందీ ఘటన. శాలరీలు ఇవ్వట్లేదని 46 రోజులుగా హాస్టల్‌లో వంట, శానిటేషన్ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. దీంతో వార్డెన్, టీచింగ్ స్టాఫ్ వండి పెడుతున్నారు. సోమవారం వారు చేసిన కిచిడీ, అన్నం తిన్న 24 మంది స్టూడెంట్స్ వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఇబ్బంది పడగా హాస్పిటల్‌కు తరలించారు. మంగళవారం పొద్దున మరో 20 మంది కడుపునొప్పితో బాధపడుతుండడంతో వారినీ హాస్పిటల్‌కు తరలించారు.
జూలూరుపాడు, వెలుగు : నెలన్నర రోజులుగా వంట, శానిటేషన్ సిబ్బంది ఆందోళనలు చేస్తున్నరు.. దీంతో వార్డెన్, టీచింగ్ స్టాఫ్ వంట చేస్తున్నరు. వంట మనుషులు వండితేనే అంతంత మాత్రంగా ఉంటది.. అట్లాంటిది వీళ్లు వండిన కిచిడీ, సరిగ్గా ఉడకని అన్నం తినడంతో 44 మంది స్టూడెంట్లకు ఫుడ్ పాయిజన్ అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం ఆశ్రమ స్కూల్‌లో జరిగిందీ ఘటన. సోమవారం సాయంత్రం 24 మంది స్టూడెంట్స్వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఇబ్బంది పడగా.. వారిని స్కూలు సిబ్బంది జూలూరుపాడు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మంగళవారం పొద్దున మరో 20 మంది కడుపునొప్పితో బాధపడుతుండడంతో వారినీ హాస్పిటల్‌కు తరలించారు.
వంట సక్కగ చేస్తలే
తమకు శాలరీలు ఇవ్వట్లేదన్న కారణంతో 46 రోజులుగా హాస్టల్‌లో వంట, శానిటేషన్ పనులు చేస్తున్న సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. దీంతో వార్డెన్, టీచింగ్ స్టాఫ్ వండి పెడుతున్నారని, వారు సరిగా వండకపోవడం వల్లే అస్వస్థతకు గురవుతున్నామని స్టూడెంట్లు చెబుతున్నారు. ఫుడ్ పాయిజన్ సమాచారం తెలియగానే తహసీల్దార్ లూథర్ విల్సన్.. హాస్పిటల్‌కు చేరుకుని స్టూడెంట్లతో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణ చేస్తామని చెప్పారు. చికిత్స తర్వాత 29 మంది పిల్లలను హాస్టల్‌కు పంపగా.. మరో 15 మందికి హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. మంగళవారం హాస్టల్‌లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఏటీడీఓ రూపాదేవి ఆశ్రమ స్కూల్‌కు వచ్చి స్టూడెంట్స్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.