పోలీస్​ డిపార్ట్​మెంట్​లో ట్రాన్స్​జెండర్ల రిక్రూట్​మెంట్

  •  ట్రాఫిక్ అసిస్టెంట్స్‌‌‌‌గా నియామకానికి సెలెక్షన్స్ 
  • గోషామహల్‌‌‌‌ పోలీస్ గ్రౌండ్‌‌‌‌లో ఈవెంట్స్‌‌‌‌
  • 44 మంది ఎంపిక.. త్వరలోనే ట్రైనింగ్‌‌‌‌
  • నగరంలో ట్రాఫిక్ మానిటరింగ్‌‌‌‌ డ్యూటీ
  • డ్రంక్​ అండ్​​ డ్రైవ్​ తనిఖీల్లోనూ సేవలు
  • రోల్‌‌‌‌ మోడల్‌‌‌‌గా నిలవాలి: సీపీ సీవీ ఆనంద్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: పోలీస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చేస్తున్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సిటీ పోలీస్ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో   ట్రాఫిక్​ అసిస్టెంట్స్​గా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్స్ సెలెక్షన్ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా బుధవారం గోషామహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్​లో ఈవెంట్స్ నిర్వహించారు. ఇందులో మొత్తం 58 మంది  పాల్గొనగా, 44 మంది సెలెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. 

ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమిస్తామని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఆయన ఆదేశాల మేరకు విమెన్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ అనితా రామచంద్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హోంశాఖ స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా సమీక్ష జరిపారు. గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో దాదాపు 3వేలకు పైగా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండగా.. విమెన్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్టర్ అయిన ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్స్ అసోసియేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమాచారం అందించారు.

హోంశాఖ సూచనలతో విద్యార్హత,సెలెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హోంశాఖ సలహాలు, సూచనల మేరకు సెలెక్షన్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబధించిన విధివిధానాలు రూపొందించారు. పదో తరగతి ఉత్తీర్ణత, జిల్లా కలెక్టర్ జారీ చేసిన ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,18 నుంచి 40 ఏండ్ల లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అసోసియేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించిన సమచారంతో సిటీ కమిషనరేట్ పరిధిలో 58 మంది ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్లై చేసుకున్నారు. 

పోలీసులు సూచించిన విధంగా సర్టిఫికెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించారు. ఈ మేరకు పోలీస్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేపట్టారు. సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో సెలెక్షన్స్​ నిర్వహించారు. విద్యార్హత, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిశీలన అనంతరం అర్హులైన వారికి 800 మీటర్ల రన్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హై జంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు.

సెలెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన వారికి త్వరలోనే ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రన్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,హై జంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్వాలిఫై అయిన 44 మంది ఫిజికల్ ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు. ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్తీర్ణులైన  వారికి సెలెక్షన్ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించారు. ఎంపికైన వారికి యూనిఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కొలతలు తీసుకున్నారు. షూ సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేకరించారు. వీటి ఆధారంగా డ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన యూనిఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సిద్ధం చేస్తారు. ఎంపికైన వారికి ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చేందుకు త్వరలోనే షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖరారు చేయనున్నారు. 

Also Read : నేడు ఇందిరమ్మ ఇండ్ల యాప్ లాంచ్

ట్రైనింగ్ పూర్తి అయిన అనంతరం ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధుల్లో వీరిని నియమించనున్నారు. సిగ్నల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ట్రాఫిక్ మానిటరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు డ్రంక్​ అండ్​ డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తనిఖీల్లో సేవలను వినియోగించుకోనున్నారు. తమిళనాడు, కేరళ, కర్నాటక, చత్తీస్​గఢ్​, బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరహాలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విధులను కేటాయించనున్నారు. ఇందుకోసం హోంగార్డుల తరహాలో జీతాలు, ప్రత్యేక యూనిఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించనున్నారు. 

సీఎం ఆదేశాల మేరకే..

ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించాలనే సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి  ఆదేశాల మేరకు సెలెక్షన్స్ చేస్తున్నాం. అర్హులైన వాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. సెలెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన వారికి ట్రైనింగ్ కోసం త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తాం. ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనంతరం ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధుల్లో నియమిస్తాం. ఈ కమ్యూనిటీ ఒక రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కావాలి. సిటీ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు రాష్ట్ర పోలీస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి పేరు తీసుకురావాలి. 

సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీపీ, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ట్రాన్స్​జెండర్​ రిక్రూట్​మెంట్​కు అర్హతలివే

వయస్సు:     18 –40 ఏండ్ల మధ్య ఉండాలి
ఎత్తు:     166 సెం.మీ
విద్యార్హత:     10 వ తరగతి ఉత్తీర్ణత
ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి జారీ చేసిన సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మాకు గుర్తింపు లభించింది

మా స్వస్థలం భద్రాచలం. డిగ్రీ పూర్తి చేశా. 2009లో హైదరాబాద్ వచ్చా. సూరారంలో నివాసం ఉంటున్నా. జీవనోపాధి లేక భిక్షాటన చేస్తున్నా. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. ఇప్పుడు ఓ గుర్తింపు లభించింది. ట్రాఫిక్​ అసిస్టెంట్​గా కష్టపడి పనిచేస్తా. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కి ధన్యవాదాలు.  

సమంత, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్, సూరారం

మాకు మంచి భవిష్యత్ ఇచ్చారు

నాది మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా తొర్రూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.10 తరగతి వరకు చదువుకున్నా. ఎక్కడా జీవనోపాధి దొరకలేదు. 2010లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చా. ప్రస్తుతం సూరారంలో ఉంటూ భిక్షాటన చేస్తున్నా. గత్యంతరం లేని పరిస్థితిలో మాత్రమే ఈ వృత్తిని ఎంచుకున్నా. మా లాంటి వారికి సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తా. సీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ధన్యవాదాలు. 

శృతి, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్, సూరారం