మహాశివరాత్రి జాతరలకు 440 స్పెషల్ ​బస్సులు

మహాశివరాత్రి జాతరలకు 440 స్పెషల్ ​బస్సులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా 25 నుంచి 28వ తేదీ వరకూ ముఖ్యమైన పుణ్యక్షేత్రాలకు స్పెషల్​బస్సులు నడపనున్నట్టు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. కీసరగుట్టకు సికింద్రాబాద్​నుంచి 90 ,ఈసీఐఎల్​క్రాస్​రోడ్స్​నుంచి 100, అమ్ముగూడ నుంచి 70, ఉప్పల్​క్రాస్​రోడ్స్​నుంచి 25 బస్సులు కలిపి మొత్తం 285 బస్సులు, ఏడుపాయలకు సీబీఎస్​నుంచి 125 బస్సులను నడపనున్నట్టు వెల్లడించారు. బీరంగూడ జాతరకు పటాన్​చెరు నుంచి 30 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు చెప్పారు. వివరాలకు కోఠి బస్​స్టేషన్​ 99592 26160, రేతిఫైల్​ బస్​స్టేషన్​9959226154 నంబర్లను సంప్రదించాలని సూచించారు.