హైదరాబాద్లో 4,44,275 కుటుంబాల సర్వే పూర్తి

హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్​లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కొనసాగుతోంది. అధికారులు బుధవారం 1,45,901 కుటుంబాల వివరాలు సేకరిచారు. మొత్తంగా ఇప్పటివరకు 4,44,275 కుటుంబాల సర్వే పూర్తయింది. జూబ్లీహిల్స్ లోని మాజీ ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడి కుటుంబ వివరాలను అధికారులు తీసుకున్నారు. హెచ్‌‌‌‌ఎండీఏ జాయింట్ కమిషనర్ కె.శ్రీవాత్సవ, వాటర్ వర్క్స్ జాయింట్ ఎండీ మయాంక్ మిట్టల్

ఎంఏయూడీ డిప్యూటీ సెక్రెటరీ ప్రియాంక కర్ణన్, కోఆర్డినేటర్ హెచ్‌‌‌‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సిటీలోని సర్వే తీరును పరిశీలించారు. కాగా కొన్ని సర్కిళ్లలో ఇన్యుమరేటర్లు రోజుకు10 నుంచి 15 ఇండ్లను సర్వే చేస్తుండగా, మరికొన్ని సర్కిళ్లలో 8 నుంచి10 ఇండ్లను మాత్రమే సర్వే చేస్తున్నారు.