- మాల్ నిర్మాణానికి తీసుకున్న అసలు, వడ్డీ కట్టాలని ఆర్డర్స్
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్జిల్లా ఆర్మూర్మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి భార్య, తండ్రి పేరుతో ఆర్టీసీ ల్యాండ్‌లో నిర్మించిన షాపింగ్‌మాల్‌ను ఇప్పుడు మరో వివాదం చుట్టుముట్టింది. మాల్నిర్మాణానికి తీసుకున్న లోన్ డబ్బు రూ.20 కోట్లతో పాటు వడ్డీ సహా ఇతర ఖర్చులు కలిపి రూ.45.46 కోట్లు కట్టాలని స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ) ఆఫీసర్లు మామిడిపల్లిలోని జీవన్‌రెడ్డి ఇంటికి నోటీసు అంటించారు. లోన్‌కు ష్యూరిటీగా ఉన్న జీవన్‌రెడ్డి ముగ్గురు బంధువుల పేర్లను నోటీస్‌లో ప్రస్తావించారు. 60 రోజుల్లోపు బాకీ కట్టకుంటే సర్ఫేసీ యాక్ట్ కింద రికవరీ చర్యలు తీసుకుంటామని అందులో స్పష్టం చేశారు. షాపింగ్‌మాల్ తరఫున చెల్లించాల్సిన లీజ్డబ్బు రూ.7.23 కోట్లు పేమెంట్చేయాలని ఈ నెల 7న ఆర్టీసీ డీఎం శ్రీనివాస్ నోటీసు అంటించడంతో పాటు దండోరా కూడా వేయించారు. కరెంట్బాకీ రూ.2.57 కోట్ల కోసం.. మాల్‌కు ట్రాన్స్‌కో సప్లయ్ నిలిపిసింది. మరో పక్క ఆయన నేతృత్వంలోని కంకర క్వారీల రికార్డులను ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు.
ఆర్టీసీ ల్యాండ్‌కు ఎస్ఎఫ్సీ లోనా?
ఆర్మూర్బస్టాండ్పక్కనే ఉన్న ఆర్టీసీ భూమి డెవలప్మెంట్కు ఎస్ఎఫ్సీ ఇచ్చిన లోన్ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా పలుకుబడి ఉపయోగించి అన్నీ తాను అనుకున్నట్లు జీవన్‌రెడ్డి చేసుకున్నాడని స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టేట్ఫైనాన్స్కార్పొరేషన్ ఆయా వ్యాపార రంగాలకు లోన్ అందిస్తుంది. ల్యాండ్ఓనర్ష్యూరిటీ తీసుకొని రూ.కోట్ల రుణం ఇస్తుంది. లోన్ ఇవ్వడమే కాకుండా వాటి ఖర్చును అజమాయిషీ చేస్తుంది. అవేమీ లేకుండా ఎస్ఎఫ్సీ రూ.20 కోట్లు ఇచ్చినట్లు వెలుగులోకి రావడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆర్టీసీ సంస్థ యజమానిగా ఉన్న భూమిపై అంత లోన్ఇవ్వడంపై చర్చ నడుస్తోంది. 2017లో ఇచ్చినట్లు తెలుస్తున్న రుణం కిస్తులేవీ చెల్లించనందున అసలు, వడ్డీ తదితరాలు కలిపి ఇప్పుడు రూ.45.46 కోట్లకు చేరింది. మెసర్స్విశ్వజిత్ఇన్ఫ్రా డెవలపర్స్పేరుతో ఆ సంస్థ ఎండీ అయిన జీవన్‌రెడ్డి భార్య ఎ.రజిత బాకీ మొత్తం తీర్చాల్సిందిగా ఎస్‌ఎప్‌సీ నోటీస్ఇచ్చింది. సాధారణంగా ఓనర్ స్థిరాస్తి విలువలో గరిష్టంగా 80 శాతం సొమ్మును బ్యాంకులు లోన్‌గా ఇస్తాయి. జీవన్‌రెడ్డి విషయంలో ఈ నిబంధనేదీ వర్తించలేదు. తాజా నోటీస్ప్రకారం బాకీ సొమ్ము రూ.45.46 కోట్లకు సమానంగా షాపింగ్మాల్విలువ ఉంటుందా? అనే టాక్మొదలైంది. ఆర్టీసీ లీజు బాకీ రూ.7.23 కోట్లు, ట్రాన్స్‌కో బిల్లు రూ.2.57కోట్లు అన్నీ కలిపితే రూ.55 కోట్లకు మించి బకాయిలు ఉన్నాయి. వీటిని రాబట్టుకోవడానికి ఆఫీసర్లు వరుస చర్యలకు దిగారు.