4 జిల్లాల్లో 45 డిగ్రీల టెంపరేచర్లు... పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెంప రేచర్లు అత్యధికంగా నమోదవుతు న్నాయి. పలు చోట్ల 45 డిగ్రీల మార్కు ను దాటేశాయి. 4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శనివారం కరీంనగర్ జిల్లా వీణ వంకలో అత్యధికంగా 45.8 డిగ్రీలు నమోదైంది.

జగిత్యాల జిల్లా జైనలో 45.4, సారంగపూర్‌‌‌‌లో 45, గోదూ రులో 44.9, ధర్మపురిలో 45.3, ఖమ్మం జిల్లా పమ్మి, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌‌ పల్లి, ముప్కాల్, ఖమ్మం జిల్లా చింతా కాని, బానాపురంలో 44.7 డిగ్రీలు నమోదయ్యాయి. హైదరాబాద్‌‌లో 42.1 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యింది. రెండ్రోజులు ఎండల తీవ్రత ఇలాగే ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.