జగిత్యాల టౌన్, వెలుగు: శ్రీరామనవమి పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ జగిత్యాల శాఖ, శ్రీరామ సేవాసమితి ఆధ్వర్యంలో స్వామివారికి భారీ లడ్డు నైవేద్యంగా సమర్పించారు. జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులోని శ్రీ కోదండ రామాలయం 45 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 45కిలోల లడ్డూను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పద్మాకర్, కోశాధికారి రాములు సహ కార్యదర్శి సంతోష్ పట్టణ అధ్యక్షులు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.