
భారతదేశం ప్రజాస్వామ్యం దేశం అనటానికి ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలి.. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 4 వేల 123 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 4 వేల 092 మంది ఎమ్మెల్యేల డేటా పరిశీలిస్తే.. 45 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ రికార్డులు ఉన్నాయి. వీళ్లందరూ దేశ ముదుర్లు అని తేల్చేసింది ADR రిపోర్ట్.. ADR అంటే ది అసోసియేషన్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫామ్స్ సంస్థ. ప్రతి ఏటా ఈ డేటా రిలీజ్ చేస్తూ ఉంటుంది.
>>> ఒక వెయ్యి 861 మంది ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని స్వయంగా ప్రకటించుకున్నారు.
>>> ఒక వెయ్యి 205 మంది ఎమ్మెల్యేలపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై దాడులు వంటి తీవ్ర క్రిమినల్ కేసు అయ్యి ఉన్నాయి. వీళ్లు విచారణ కూడా ఎదుర్కొంటున్నారు.
>>> బీహార్ రాష్ట్రంలో 49 శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
>>> మహారాష్ట్రలో 41 శాతం, తమిళనాడులో 59 శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ ఛార్జీలు ఉన్నాయి.
>>> ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే 119 మంది ఎమ్మెల్యేల్లో సగం మంది అంటే 60 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.
>>> ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో 45 శాతం మంది ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.
>>> బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కొంత మంది ఎమ్మెల్యేలను కోర్టులు నేరస్తులుగా నిర్థారించింది. అయినా వీళ్లు ఎన్నికల్లో పోటీ చేసి మరీ గెలిచారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్.. నెంబర్ వన్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వీరిలో 138 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే ఇది 79 శాతంగా ఉంది. దేశంలోనే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో అత్యధికులు ఏపీ అసెంబ్లీలోనే ఉన్నారు. దేశంలోనే నెంబర్ స్థానం కూడా ఏపీదే. మరో విశేషం ఏంటంటే.. ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. 164 మంది అధికార పార్టీకి చెందిన వారే.. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు దాదాపు అందరూ.. ఐదుగురు, ఆరుగురు మినహా అందరిపై క్రిమినల్ కేసులు ఉండటం.. వాటిని ఎదుర్కోవటం జరుగుతుంది.
ఏపీలో మరో విశేషం ఏంటంటే.. ప్రస్తుతం ఉన్న 175 మంది ఎమ్మెల్యేల్లో 98 మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై దాడులు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉండటం విశేషం.
>>> తెలుగుదేశం పార్టీ నుంచి 134 మంది ఎమ్మెల్యేలు గెలవగా.. 115 మంది టీడీపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉణ్నాయి. వీరిలో 82 మంది ఎమ్మెల్యేలు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Also Read:-తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఒకట్రెండు బైకులు.. ఐదు కుటుంబాలకు ఓ కారు..