49 బాటిళ్ల గోవా లిక్కర్ పట్టివేత

హైదరాబాద్ సిటీ, వెలుగు: గోవా నుంచి సికింద్రాబాద్ కు వాస్కోడిగామా రైలులో అక్రమంగా తరలిస్తున్న 49 లిక్కర్​బాటిళ్లను వికారాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

శనివారం తెల్లవారుజామున రైలులో తనిఖీలు చేశారు. పట్టుకున్న 49 లిక్కర్​బాటిళ్ల విలువ రూ.90 వేలు ఉంటుందని తెలిపారు.