
డీర్ అల్ బలాహ్(గాజా): ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు గాజా స్ట్రిప్‌లో 45 వేల మందికిపైగా మరణించారని గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. లక్ష మందికిపైగా గాయపడ్డారని పేర్కొంది. మృతుల్లో సగానికి పైగా మహిళలు, పిల్లలేనని తెలిపింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం 2023, అక్టోబర్‌లో మొదలై 14 నెలలుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 45,028 మంది మృతి చెందారని, 1.06 లక్షల మంది గాయపడ్డారని గాజా హెల్త్ మినిస్ట్రీ వివరించింది. వేలాది మృతదేహాలు ఇప్పటికీ శిథిలాల కిందే ఉన్నాయని, కొన్ని ప్రాంతాలకు డాక్టర్లు చేరుకోలేకపోతున్నారని అందువల్ల మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. 23 లక్షల మంది జనాభా ఉన్న గాజాలో మృతుల సంఖ్య దాదాపుగా 2 శాతంగా ఉంది.