ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 50లోపే పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం...  ఏపీ వ్యాప్తంగా కేవలం 46 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.  ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 12,092 కరోనా శాంపిల్స్ పరీక్షలు చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు. గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 134 మంది బాధితలు కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా కేవలం 661 కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.

మరోవైపు భారత్‌లో కూడ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,194 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా 255 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 515,714కు చేరింది. మరోవైపు చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొవిడ్కు పుట్టినిల్లైన ఆ దేశంలో గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాదాపు 90 లక్షల జనాభా కలిగిన చాంగ్ చున్ సిటీలో శుక్రవారం భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.

ఇవి కూడా చదవండి:

చైనాలో విజృంభిస్తున్న కరోనా