కర్ణాటకలోని మాండ్యాలో గణపతి ఊరేగింపు క్రమంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 2024, సెప్టెంబర్11న మాండ్యా జిల్లా బదరికొప్పులలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు సాగుతుండగా ఓ వర్గం రాళ్లు రువ్వడంతో ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనకు కారణమైన 46 మందిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు.
దీంతో పలువురు హిందూ యువకులు గణేష్ విగ్రహాన్ని పోలీస్‌స్టేషన్ ఎదుట ఉంచి తమకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. మరోవైపు ఒక వర్గం వారు కొన్ని దుకాణాలకు నిప్పంటించి, టైర్లను తగులబెట్టారు, ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఘర్షణల నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. బదరి కొప్పుల ప్రాంతంలో హై అలెర్ట్ ప్రకటించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారతీయ నాగరిక్ సురక్షణ సంహిత సెక్షన్ 163 విధించారు.
గుజరాత్‌లోని సూరత్‌లో ఆరుగురు మైనర్లు గణేష్ పండల్‌పై రాళ్లు రువ్వారని ఫలితంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయని ఆరుగురు మైనర్లను అరెస్టు చేసిన కొద్ది రోజుల తర్వాత కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.