ఘోర విమాన ప్రమాదం.. విమానం ఇళ్ల మధ్య కూలి 46 మంది సజీవ సమాధి

ఘోర విమాన ప్రమాదం.. విమానం ఇళ్ల మధ్య కూలి 46 మంది సజీవ సమాధి

సూడాన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సూడాన్ కాలమానం ప్రకారం మంగళవారాం (ఫిబ్రవరి 25)  సాయంత్రం ఒందుర్మన్ లో 46 మందితో కూడిన ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ ఇళ్లమధ్య కూలడంతో 46 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. గత 20 ఏళ్లలో సూడాన్ లో ఇంత ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు. 

మంగళవారం కర్రారీలో ఆంటొనోవ్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిన ఒక రోజు వ్యవధిలోనే మరో ఎయిర్ క్రాఫ్ట్ కూలడం ఘోరమైన ఘటనగా పేర్కొన్నారు. నిన్నటి ప్రమాదంలో 10 మందికి గాయాలు అయితే.. ఇవాళ్టి ప్రమాదంలో 46 మంది చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. 

వాది సయిద్నా ఎయిర్ బేస్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగిందని మిలిటరీ అధికారులు ప్రకటనలో తెలిపారు. టేక్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలిపోయిందని తెలిపారు. 

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఒందుర్మన్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సూడాన్ వైద్య శాఖ తెలిపింది. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులతో పాటు 5 మంది పౌరులు ఉన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అవ్వడంతో కర్రారీ జిల్లాలో చాలా వరకు ఇళ్లు నాశనం అయినట్లు ప్రకటన విడుదల చేశారు. 

ఈ ప్రమాదంలో మిలిటరీ ఆఫీసర్లు, ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బందితో పాటు పౌరులు మృతి చెందారు. క్రాష్ అయిన వెంటనే భారీగా మంటలు ఎగసి పడ్డాయి. మంటల్లో నుంచి బయట పడేందుకు ప్రయత్ని్స్తున్న వారిని వీడియోలో చూడవచ్చు. సూడాన్ లో ఇంత ఘోర ఘటన ఈ మధ్యకాలంలో ఇదేనని సూడాన్ మీడియా పేర్కొంది.