దేశంలో కరోనా పాజిటివ్ కేసులు గత కొన్ని రోజులుగా తగ్గుతున్నాయి. ఇంతకు ముందు ప్రతి రోజు దాదాపు 70 వేలకు పైగా నమోదయ్యేవి.కానీ గత నాలుగు రోజులు 50 వేలకు పైగా నమోదవుతున్నాయి. మొదటి సారి 50 వేలకు దిగువన కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 46,791 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 587 మంది చనిపోయారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75,97,064 కు చేరగా..మరణాల సంఖ్య1,15,197 కు చేరింది. నిన్న ఒక్కరోజే 69,720 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం 67,33,329 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 7,48,538 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరోసారి నేపాల్ దొంగల బీభత్సం.. మత్తిచ్చి ఇళ్లు గుల్ల చేసి పరార్
India reports 46,791 new #COVID19 cases & 587deaths in last 24 hours.
Total cases – 75,97,064
Active cases – 7,48,538 (dip by 23,517 since y'day)
Cured/discharged/migrated – 67,33,329 (rise by 69,721 since y'day)
Deaths – 1,15,197 (rise by 587 since y'day) pic.twitter.com/RbEE0X39WN— ANI (@ANI) October 20, 2020