
నిమజ్జనాల కోసం గ్రేటర్ వ్యాప్తంగా అన్నిచోట్లా కలిపి జీహెచ్ఎంసీ 468 క్రేన్లు ఏర్పాటు చేసింది. కేవలం హుస్సేన్సాగర్పైనే 38 క్రేన్లు ఏర్పాటు చేసింది. వీటి కోసం మూడు షిఫ్టుల్లో 15 వేల మంది బల్దియా సిబ్బంది డ్యూటీ చేయనున్నారు గ్రేటర్ వ్యాప్తంగా 10 కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూంలో అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారులు పర్యవేక్షించనున్నారు.