24 రోజుల్లోనే రూ. 47కోట్ల ఫైన్ వసూలు... వాహనదారులకు షాకిచ్చిన ఢిల్లీ సర్కార్.. ఎందుకంటే

24 రోజుల్లోనే రూ. 47కోట్ల ఫైన్ వసూలు... వాహనదారులకు షాకిచ్చిన ఢిల్లీ సర్కార్.. ఎందుకంటే

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ రెట్టింపవుతోంది. వాయు కాలుష్యాన్ని సీరియస్ గా తీసుకున్న ఢిల్లీ సర్కార్ నివారణ చర్యలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో వాయు కాలుష్య నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల నుండి ముక్కు పిండి ఫైన్లు వసూలు చేస్తోంది ఢిల్లీ సర్కార్. అక్టోబర్ 1 నుండి 24 వరకు పొల్యూషన్ సర్టిఫికెట్స్ కు సంబంధించిన ఉల్లంఘనలకు మొత్తం రూ. 47 కోట్ల జరిమానా విధించినట్లు సమాచారం.

పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్లను సమర్పించడంలో విఫలమైనందుకు గాను వాహనదారులకు 47 వేల  చలాన్‌లు జారీ చేశారు. ఈ మేరకు ఒక్కో వాహనదారునికి రూ.10 వేలు జరిమానా విధించారు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు.రోడ్లపై వాహనాల సంఖ్య పెరగడం వల్ల ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతోందని... దేశరాజధానిలో ఎయిర్ క్వాలిటీ సమస్యలు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని అధికారులు తెలిపారు.

ALSO READ | బాణాసంచాపై నిషేధం వెనక హిందూ–ముస్లిం కోణం లేదు: కేజ్రీవాల్

అక్టోబర్ నెలలోనే ఐటీఓ చౌక్, పీరాగర్హి, ఆశ్రమ్ చౌక్, ఆనంద్ విహార్, మెహ్రౌలీతో సహా అన్ని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించారని... అక్టోబర్ 24 వరకు సుమారు 47,343 మంది వాహనదారులు పీయూసీ సర్టిఫికెట్ లేకుండా లేదా గడువు ముగిసిన సర్టిఫికేట్లతో పట్టుబడ్డారని అధికారులు తెలిపారు. కాలుష్య నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఎప్పటికప్పుడు వాహనాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు అధికారులు.