- జగిత్యాలలో భానుడి ప్రతాపం
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో సోమవారం అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా ఇబ్రహీంపట్నం మండలం గోదూరులో 46.8, రాయికల్ మండలం అల్లీపూర్లో 46.1, బీర్పూర్ మండలం కొల్వాయి లో 46.1,ధర్మపురి మండలం బుర్దేష్ పల్లి లో 45.1 డిగ్రీలు నమోదయ్యాయి. ఎండల ధాటికి ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రోడ్లన్నీ కర్ఫ్యూ ను తలపిస్తున్నాయి. జిల్లాకు అధికారులు ఇప్పటికే రెడ్ అలెర్ట్ జారీ చేసారు. వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులు జిల్లా ప్రజలకు సూచించారు.