ఇటలీలో కరోనా రికార్డు.. నిన్న ఒక్కరోజే..

ఇటలీలో కరోనా రికార్డు.. నిన్న ఒక్కరోజే..

2,978కి చేరిన కరోనా మృతులు.. కేసులూ వేగంగా పెరుగుదల

ఇటలీని కరోనా వైరస్​ ఊపిరితీసుకోనివ్వట్లేదు. రోజూ వేలాది మందికి అంటుతూ, వందలాది మంది ఉసురు తీసేస్తోంది. ఇంకా చెప్పాలంటే మరణాల్లో చైనాను దాటేసేంతలా ఇటలీని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది వైరస్​. మొత్తంగా దేశంలో 35,713 కేసులు నమోదవగా, బుధవారం ఒక్కరోజే కొత్తగా 4,207 కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా అక్కడ ఇదే రికార్డు. అంతకుముందు మార్చి 15న 3,590 కేసులు రికార్డయ్యాయి. ఇటు ఒక్కరోజే రికార్డు స్థాయిలో 475 మంది చనిపోయారు. అంతకుముందు మార్చి 15న ఎక్కువగా 368 మంది చనిపోయారు. వైరస్​కు కారణమైన చైనాలోనూ ఇంత వేగంగా కరోనా బాధితులు చనిపోలేదు. అక్కడ ఒక్కరోజులో హయ్యెస్ట్​ చనిపోయింది 150 మందే. ప్రపంచవ్యాప్తంగా 2,13,541 మందికి కరోనా వైరస్​ సోకింది. మొత్తంగా 8,790 మంది చనిపోయారు. ఒక్కరోజులో 817 మంది వైరస్​కు బలయ్యారు. చైనాలో చనిపోయిన వారి సంఖ్య 3,237కు చేరింది. కొత్త కేసుల సంఖ్య 13 కాగా, 11 మంది చనిపోయారు. ఇరాన్​లో ఒక్కరోజులో 147 మంది వైరస్​తో కన్నుమూశారు. దీంతో అక్కడ మరణాల సంఖ్య 1,135కి చేరింది. 17,361 మంది వైరస్​ బారిన పడ్డారు. స్పెయిన్​లోనూ మరణాలు వేగంగా పెరుగుతున్నాయి. బుధవారం వైరస్​తో 90 మంది చనిపోయారు. దీంతో అక్కడ మరణాల సంఖ్య 623కి చేరింది. ఫ్రాన్స్​లో 175 మంది చనిపోగా, 7,730 మందికి వైరస్​ సోకింది. అమెరికాలో 117, బ్రిటన్​లో 104 మంది కరోనాకు బలయ్యారు.

For More News..

పారాసిటమాల్‌తో ఇన్‌ఫెక్షన్ తగ్గదు.. సీసీఎంబీ డైరెక్టర్

24 గంటలు.. ఆన్ డ్యూటీ.. రంగంలోకి హెల్త్ సోల్జర్స్

కరోనా వల్ల పరీక్ష వాయిదా

ఒక్కరోజే 8 పాజిటివ్ కేసులు.. మొత్తంగా 13కు చేరిక

కరోనా ఎఫెక్ట్: కరీంనగర్​లో మూడు కిలోమీటర్లు షట్​ డౌన్